ఇయర్ ఎండింగ్ లో హైదరాబాద్ నగరంలో మంగళవారం హైడ్రా కూల్చివేతలతో హడలెత్తిస్తున్నట్లు స్థానిక ప్రజలు వాపోయారు. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన ఆక్రమణలు కూల్చివేతలు చేపట్టారు. నాలుగు ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్ తొలగింపు.. 20కి పైగా దుకాణాలను తొలగించిన హైడ్రా సిబ్బంది. నోటీసు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బందోబస్తులో కూల్చివేత చేపట్టారు.