సికింద్రాబాద్: సమగ్ర కుటుంబ సర్వే సరళిని పరిశీలించిన కార్పొరేటర్ హేమ
నామాలగుండులోని ఉప్పర బస్తీలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సరళిని శనివారం కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పరిశీలించారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని డోర్ కి స్టికర్ అతికించడం జరిగింది. రెండు రోజుల తరువాత పూర్తి వివరాలకు జిహెచ్ఎంసి సిబ్బంది వస్తారని వారికి సహకరించాలని ప్రజలను కోరారు.