ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ ముస్లిం కుటుంబం తమ కుమార్తె పెళ్లి కార్డుపై గణేశుడి చిత్రాన్ని ముద్రించింది. హిందూ సమాజంలోని ప్రజలకు ప్రేమపూర్వక ఆహ్వానం కోసం ఈ కార్డును ముద్రించినట్లు వధువు తండ్రి షబ్బీర్ చెప్పారు. “నా కుమార్తె పెళ్లి కార్డును హిందూ, ముస్లిం మతాలకు అనుగుణంగా ముద్రించా. హిందూ స్నేహితులకు హిందూ కార్డులు, ముస్లింలకు ముస్లిం కార్డులు ఇస్తున్నా," అని ఆయన చెప్పారు.