అల్వాల్: ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు తనిఖీ

59பார்த்தது
అల్వాల్: ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు తనిఖీ
ఓల్డ్ అల్వాల్ లో నిర్మిస్తోన్న ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రి నిర్మాణాన్ని ఈనెల 18 నాటికి పూర్తి చేయాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రంగనాథ స్వామి కాంట్రాక్టర్ కు సూచించారు. అల్వాల్ కార్పొరేటర్ శాంతి, స్థానిక వైద్య అధికారులతో కలిసి శనివారం ఆసుపత్రి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు ఈ వారంలో పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி