బ్యూటిఫికేషన్ పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడం తగదని శుక్రవారం ఎమ్మెల్యే తలసాని అన్నారు. మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో అమీర్‌పేట్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వెస్ట్ మారేడ్‌పల్లిలో ఎమ్మెల్యేను కలిసి తమ ఆవేదన విన్నవించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హనుమాన్ టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్ ప్రాంతాల్లో పేదలు ఎన్నో ఏళ్లుగా చిన్నవ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు.