కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం శుక్రవారం జరగనుంది. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎన్. వి. నంజుండేశ్వర ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సీఈఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో పాటు ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్ పాల్గొననున్నారు. ఆగస్టు 24న జరిగిన సాధారణ సమావేశంలో అనంతరం చేపట్టిన పాలనాపరమైన సర్క్యులర్ ఎజెండాలకు ఆమోదంతోపాటు పలు కీలక అంశాలపై బోర్డులో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.