వేద మంత్రోచ్చరణల మధ్య హైదర్ గూడలోని పోచమ్మ దేవాలయ పునర్నిర్మాణ భూమిపూజ గురువారం జరిగింది. తెల్లవారు జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు భారీ ఏర్పాటు చేశారు. దేవాలయంలో హోమాన్ని నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు.