రంగారెడ్డి జిల్లా పాలమాకుల గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. వెంకటయ్య ఆదివారం ఎయిర్ పోర్ట్ లోని నిర్మానుష ప్రాంతంలో శవమై కనిపించాడు. ఎయిర్ పోర్ట్ ప్రధాన దారి వద్ద సెక్యూరిటీ అధికారులకు దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.