15న పూడూర్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ రాక
ఈనెల 15న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి కొండా సురేఖ రానున్నారు. ఈ సందర్భంగా డిసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి వారిని కలిసి ఆహ్వాన పత్రికను అందించి, శంకుస్థాపన కార్యక్రమానికి గురువారం ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, నేవీ అధికారులు ఉన్నారు.