ముషీరాబాద్: నవంబర్ 7న ఎస్ వి కే లో జాతీయ సెమినార్
దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోరాడాలని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల ఐక్యత లోపం వల్లనే దేశ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా, ఉద్యోగాలలో అణచివేతకు గురవుతున్నారని ఆయన అన్నారు. బుధవారం బాగ్లింగంపల్లిలోని ఎంసీపీఐ కార్యాలయంలో నవంబర్ 7న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే జాతీయ సెమినార్ పోస్టర్ను ఆవిష్కరించారు.