రాంనగర్ జై దుర్గ భవాని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి పూజ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై దుర్గ మాతకు పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి. శ్రీనివాస్ రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, నాగులు యాదవ్, గొల్ల శ్రీను, శంకర్ ముదిరాజ్, నవీన్ యాదవ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.