రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచకుండా బీఆర్ఎస్ అడ్డుకున్న నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంబరాల్లో భాగంగా ముషీరాబాద్‌లోని గాంధీనగర్ డివిజన్లోని ఆంధ్రా కేఫ్ చౌరస్తాలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో బుధవారం బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు ముఠా జై సింహా, రాకేశ్ కుమార్ పాల్గొన్నారు.