దేశీయ మార్కెట్లో ఈ ఏడాది ఐపీఓల హవా కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి పబ్లిక్ ఆఫర్ల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమీకరించేందుకు పలు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. మరికొన్ని దలాల్ స్ట్రీట్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన ఐపీఓలు చరిత్ర సృష్టించాయి. 2024 ముగియడానికి ఇంకా 2 నెలల ముందే సరికొత్త రికార్డును నెలకొల్పాయి.