మూసి సుందరీకరణ పేరుతో పేద ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారని దళిత బహుజన ఫ్రంట్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మూసి సుందరీకరణ ఎవరి కోసం అంటూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బడా బాబులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసమే మూసి సుందరీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం మూసి నదిని ప్రక్షాళన చేయాలన్నారు.