తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామ పాఠశాల ఆవరణలో ప్రధాన రహదారిపై మంగళవారం ట్రాఫిక్ కంట్రోలింగ్ బోర్డ్స్ ను మాజీ సర్పంచ్ బక్కి కుమార్ ప్రారంభించారు. ప్రధాన రహదారిపై ఉన్న పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగవద్దని గ్రామానికి చెందిన దాతలు రాణి, రాజు యాదవ్ దంపతులు బోర్డ్స్ ను గ్రామపంచాయతీ కి అందజేశారు. దాతలు అందజేసిన బోర్డ్స్ ను ఆయన ప్రారంభించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలన్నారు.