బాలాపూర్ మండలంలోని ప్రతి చెరువును సుందరీకరిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్ పేట కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడా పోచమ్మకుంట చెరువు సుందరీకరణ పనులను ఆమె పర్యవేక్షించారు. కొన్ని చెరువుల్లో గుర్రపుడెక్క అమాంతం పెరిగిపోయిందన్నారు. గుర్రపుడెక్కను తొలగించేందుకు అధికారుల అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ అధికారులు బాధ్యతగా భావించి తొలగిస్తారని తెలిపారు.