పోచంపల్లి పాత రోడ్డు పునరుద్ధరణకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చర్యలు చేపట్టారని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పోచంపల్లి పాత రోడ్డు పునరుద్ధరణ కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆయన ఎంపీ లెటర్ ప్యాడ్ తో క్రీడా వ్యవసాయ క్షేత్ర డైరెక్టర్ వినోద్ కుమార్ సింగ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. పోచంపల్లి పాత రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రహరీని తొలగించాలని కోరినట్లు కొప్పుల తెలిపారు.