సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్యానికి భరోసా అని, ఎంతో మంది పేదలకు ఆర్థికంగా లబ్ధి జరిగిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ తెలిపారు. పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం ఆయన వనస్థలిపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కుట్ల నరసింహ, శ్రీనివాస్ తో కలిసి అందజేశారు.