కులగణనను వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం అడిషనల్ కమిషనర్, ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల కులగణన నోడల్ అధికారి ఎస్. పంకజ మంగళవారం తెలిపారు. హయత్ నగర్ సర్కిల్ మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని రాగాల ఎన్ క్లేవ్, సహారా ఎస్టేట్స్ లో నిర్వహించిన కుల గణనను మంగళవారం ఆమె పరిశీలించారు.