కాలనీలో డ్రైనేజీ సమస్యలు రాకుండా జలమండలి అధికారులు కృషి చేయాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయి కోటి పవన్ కుమార్ అన్నారు. శుక్రవారం కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ వాటర్ ట్యాంక్ పక్కన వేస్తున్న నూతన డ్రైనేజీ లైన్ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలనీలో డ్రైనేజీ లైన్ ను లెవెల్స్ చూసుకుని వేయాలని, మళ్లీ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుందర్ నారాయణ, సత్యనారాయణ పాల్గొన్నారు.