మార్నింగ్ వాక్ లో భాగంగా శుక్రవారం హయత్ నగర్ డివిజన్ లోని పలు కాలనీలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పర్యటించి కాలనీవాసుల సమస్యలను తెలుసుకున్నారు. అదేవిధంగా వారు కాలనీలో జరుగుతున్న భాగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను పరిశీలించారు. కాలనీలో ఎలాంటి సమస్యులు ఉన్న వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వారు కాలనీవాసులకి తెలిపారు. ఈ పర్యటనలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.