చిన్నారికి స్కూల్ బ్యాగ్‌ను అందించిన కేటీఆర్
హైడ్రా కూల్చివేతలో ఇల్లు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. బాగా చదువుకోవాలని చిన్నారి వేదశ్రీకి చెప్పి స్కూల్ బ్యాగ్‌ను అందించారు. వేద శ్రీ తండ్రికి పార్టీ తరపున సహాయం చేస్తానని కేటీఆర్ హామీఇచ్చారు. అనంతరం ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను కేటీఆర్ తీసుకున్నారు. ఇల్లు వచ్చే విధంగా కొట్లాడుతానన్నారు.