తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. విశాఖపట్నంలోని VMRDAలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'ప్రధాని రెండేళ్ల క్రితం రోజ్గార్ మేళా ప్రారంభించి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. 8 లక్షల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చారు. విశాఖలో ఇంకా ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉంది. పోలవరంకు జాతీయ హోదా కల్పించింది మోదీ ప్రభుత్వమే' అని గుర్తు చేశారు.