కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉప్పల్, నాచారంలో ఎస్టీపీ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ రూపురేఖలను మార్చేందుకే గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చామని అన్నారు.