యాకుత్ పురా లోని ఓ ఇంట్లో బాణాసంచా నిలువలకు మంటలు అంటుకోవడం తో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ దంపతులు ఉషారాణి, మోహన్ లాల్ ఆసుపత్రి లో చికిత్స పొందుతులు మృతి చెందారు. వీరికి బాణాసంచా దుకాణం ఉండటంతో దుకాణం మూసివేయగానే మిగిలిన బాణాసంచా ఇంట్లో ఉంచడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు గా తెలుస్తుంది. వీరి కుమార్తె ఆసుపత్రి లో చికిత్స పొందుతుంది.