ప్రజల బాగోగులు పట్టించుకోవడంలో, తాజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్ పల్లిలోని క్యాంపు ఆఫీసులో అయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎంతసేపు బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం మానేసి ముందు ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.