మూసీ నది కాలుష్య కోరల్లో చిక్కుకుని పోవడానికి 40 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనే కారణం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మూసీ పునరుజ్జీవం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి అనేక మాటలు మార్చారని నిజానికి ఈ మూసీ ప్రాజెక్టు వెనుక అసలు కథన వేరే ఉందని శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు అల్లుడి కోసం మూసీ ప్రాజెక్టు తెచ్చారని ఆరోపించారు.