హైదరాబాద్: రేవంత్ సర్కార్‌పై యుద్ధం తప్పదు: మందకృష్ణ
సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌పై యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ నగరం మోడ్రన్ ఫంక్షన్ హాల్లో హైదరాబాద్ జిల్లా మాదిగల ధర్మయుద్ధ సదస్సు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాదిగ అధ్యక్షతన జరిగింది. హాజరైన మందకృష్ణ మాదిగ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.