తూకంలో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని, నయాపైసా రైతులకు నష్టం వాటిల్లొద్దని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో జరిగినట్లు ధాన్యం కొనుగోలులో రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు.