ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో ఏర్పాటు చేస్తున్న మహేశ్వరం మెడికల్ కాలేజీ పనులను జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. మెడికల్ కాలేజీలో జరగాల్సిన పనులు, అందుబాటులోకి తీసుకురావాల్సిన పరికరాలు, కాలేజీ వసతుల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీ పనులు నిర్వహిస్తున్న సమయంలో సివిల్ పనులు, హాస్టల్ వసతులు తదితర సంబంధిత పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.