పెద్ద అంబర్పేట్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

65பார்த்தது
పెద్ద అంబర్పేట్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
పెద్ద అంబర్పేట్ పరిధి సాయినగర్ కాలనీలోని సాయిబాబా దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్తడి శేఖర్ రెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే బాబాకు అభిషేకాలు, అర్చనలతో భక్తులు పూజలు చేశారు.  స్థానిక కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி