పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని ప్రజాభవన్లో 101 మందికి 33. 16లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురునాథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి , కోడూరి రమేష్, శశాంకరెడ్డి, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.