యాచారం, చౌదర్పల్లి గ్రామానికి చెందిన ముక్కరి మధుసూదన్ తనకున్న ఇల్లు పై లోను తీసుకోవడం కోసం ఆస్తి ధృవీకరణ పత్రం కావాలని పంచాయతీ కార్యదర్శి చుట్టూ ఆరు నెలలుగా తిరుగుతున్నాడు. పంచాయతీ కార్యదర్శి జోష్ణ పర్మిషన్ కోసం 60 వేలు లంచం అడగగా తాను ఇవ్వలేనని చెప్పాడు. మళ్లీ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీని కలిసి వేడుకోగా ఇవ్వనని చెప్పడంతో మధుసూదన్ గురువారం సాయంత్రం అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.