హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని మైలర్ దేవ్ పల్లి డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎస్.వెంకటేష్ శనివారం డిమాండ్ చేశారు. దేవాలయలపై జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోని, దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని అయన డిమాండ్ చేశారు. ఈ దాడులు సమాజంలో భిన్నత్వానికి దారితీస్తాయని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని వారు హెచ్చరించారు.