
ఆమనగల్లు: ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఆమనగల్లు పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని మండల పార్టీ అధ్యక్షుడు కొప్పు యాదయ్య ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మండల వ్యవస్థను ఏర్పాటు చేసి సామాన్యులకు పాలన సౌలభ్యాన్ని చేరువ చేసిన ఘనత టిడిపికే దక్కుతుందని పేర్కొన్నారు. నాయకులు జంగయ్య, వెంకటేష్ గౌడ్, సత్తయ్య, దేవేందర్, రహీం పాల్గొన్నారు.