నాటకం జరుగుతుండగా శ్రీ రాముడు, రావణుడి పాత్రలు పోషించే నటుల మధ్య వివాదం తలెత్తడంతో స్టేజీపైనే ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది. సేలంపూర్ గొన్సాయి గ్రామంలో రాంలీలాను ప్రదర్శిస్తుండగా, రావణుడిగా నటిస్తున్న కళాకారుడు శ్రీరాముని పాత్రలో ఉన్న వ్యక్తిని తోసేశాడు. దీంతో రాముడి పాత్రలో ఉన్న కళాకారుడు పడిపోయాడు. వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి గొడవను సద్దుమణిగించారు.