TG: BJP MLA రాజాసింగ్ CM రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 6న నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. గత 15 ఏళ్లలో ఎప్పుడూ శాంతికి భంగం కలిగించలేదని అన్నారు. ఈ దఫా అధికారులు తనపై ఒత్తిడి తెస్తున్నారని, లక్షలాది మంది రామ భక్తుల భక్తిని ఏ శక్తి ఆపలేదన్నారు. సీపీ ఆనంద్‌కు మీరైనా చెప్పి అనుమతులు ఇవ్వాలని, సీఎం కూడా శోభాయాత్రలో పాల్గొనాలని రాజా సింగ్ ఆహ్వానించారు.