తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి 7 గంటల వరకు వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ లో వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మ్యాచ్ కు వాన ముప్పు ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.