కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనపై మేధావులు, ప్రజలు, వివిధ సామాజిక వర్గాలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు బేగంపేట ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు.