వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ తనకు కొత్తే కానీ, పోరాటం కొత్త కాదన్నారు. వయనాడ్ ప్రజల ధైర్య సాహసాలే తనలో స్ఫూర్తి నింపాయని అన్నారు. వయనాడ్ ప్రజల తరపున పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించారు. వయనాడ్ ఉప ఎన్నిక నవంబర్ 13న జరగనుంది. 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.