బీహార్‌లో నిరుద్యోగులను పోలీసులు దారుణంగా కొట్టారు. దాదాపు 8 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న 70వ బీపీఎస్సీ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అభ్యర్థులు బెయిలీ రోడ్‌లోని కమిషన్ కార్యాలయం వెలుపల గుమిగూడారు. అభ్యర్థులలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.