AP: 2027 జూన్ నాటికి పోలవరం పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేర పనులు జరగకపోతే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, నీళ్లు విశాఖకు తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టూ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అటు వెలిగొండ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు.