ఏపీలో దారుణ ఘటన జరిగింది. గుంటూరు కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌కు కూత వేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే ప్రసవించడంతో అధికారులు జీజీహెచ్‌కి తరలించారు. ఈ ఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్‌డబ్ల్యూ ఓ జయప్రదను సస్పెండ్ చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, సమీప బంధువు యువతి గర్భానికి కారణమని సమాచారం.