సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్
జిల్లాలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్, డిపిడిఓ కవిత, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.