ఐఎంఏ ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపుమేరకు శనివారం పెద్దపల్లి పట్టణంలో వైద్యులు హాస్పిటల్ ల బంద్ పాటించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ పట్టణంలో వైద్యులు నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.