పాకిస్థాన్ వేదికగా బుధవారం నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే ట్రోఫీలో భాగంగా కరాచీ మైదానంలో అన్ని దేశాల జాతీయ జెండాలను ఉంచిన పాకిస్థాన్ భారత్ జాతీయ పతకాన్ని ప్రదర్శించలేదు. దీంతో పాక్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే విమర్శలతో దిగొచ్చిన పాక్ ఎట్టకేలకు భారత్ జాతీయ జెండాను ప్రదర్శించింది.