అమెరికా ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు కమలాహారిస్, టిమ్ వాజ్ తరుపున మాజీ అధ్యక్షుడు ఒబామా డెట్రాయిట్లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన ర్యాప్ ఐకాన్ ఎమినెమ్తో కలిసి ర్యాప్ సాంగ్ పాడారు. ‘లూజింగ్ యువర్ సెల్ఫ్’ అంటూ తన గొంతును సవరించుకొని ప్రచారంలో పాల్గొన్న వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.