అందాల పోటీలు కాదు.. మహిళ భద్రత కల్పించాలి: సబితా ఇంద్రారెడ్డి

52பார்த்தது
అందాల పోటీలు కాదు.. మహిళ భద్రత కల్పించాలి: సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో మహిళలకు భద్రత లేదని BRS నేత సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. MMTS ట్రైన్‌లో బాధితురాలపై అత్యాచారం యత్నం జరిగిందని.. మహిళ కోచ్ లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచారం యత్నం చేశాడని చెప్పారు. మహిళలపై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22%పెరిగినట్లు నివేదికలు చెపుతున్నాయన్నారు. మహిళల భద్రతపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అందాల పోటీలు కాదని.. మహిళ భద్రత కల్పించాలని కోరారు. బాధితురాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி