హర్యానా గవర్నర్ కు స్వాగతం పలికిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని డాక్టర్ కేశవరావు బలిరాం హెగ్దేవార్ స్ఫూర్తి కేంద్రాన్ని ఆదివారం పరిశీలించడానికి వచ్చిన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్వాగతం పలికారు. డిచ్పల్లిలోని బీజేపీ నాయకులు గద్దె భూమన్న స్వగృహం వద్ద ఆయనకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అతని వెంట బీజేపీ నాయకులు పాల్గొన్నారు.