తెలంగాణలో ఒక ఊరిలో ఆశ్చర్యాన్ని కలిగించేలా ఒకే పేరుతో 200 మంది ఉన్నారు. ఆ ఊరే జనగామ జిల్లాలోని లింగాలఘణపురం అనే గ్రామం. త్రేతాయుగం నుంచే ఇక్కడ శ్రీరామచంద్రస్వామి ఆలయం ఉంది. దీంతో గ్రామస్థుల్లో చాలామంది 'రాములు' అనే పేరు పెట్టుకోవడం అనవాయితీగా వస్తోంది. ఇలా ఆ ఊరిలో ఏకంగా 200 మంది ఒకే పేరు పెట్టుకోవడం విశేషంగా చెప్పవచ్చు. అయితే నేటి తరం పిల్లలకు రాములు అని కాకుండా 'ర' అక్షరంతో పేర్లు పెడుతున్నారు.